సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘షాడో’

First Posted at 16:04 on Apr 18th

Shadow
విక్టరీ వెంకటేష్ హీరోగా భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘షాడో’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు ముగిసాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరుచూరి కిరీటి నిర్మించాడు. ఈ సినిమలో తాప్సీ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మలేషియా, చుట్టు ప్రక్కల పలు ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ సినిమా మొత్తం ఉంటాడు, అలాగే ఈ సినిమాలో వెంకటేష్ – ఎం.ఎస్ నారాయణ కాంబినేషన్ సీన్స్ హైలైట్ అవుతాయని ఆశిస్తున్నారు.

Exit mobile version