పొడిగించిన రేయ్ క్లైమాక్స్ చిత్రీకరణ

First Posted at 03:51 on Apr 18th

Rey (5)

వై.వి.ఎస్ చౌదరి తాజా చిత్రం ‘రేయ్’ చిత్రం ప్రధాన షూటింగ్ భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం పై అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట ఒక్కదానికే 1.5 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. వై.వి.ఎస్ చౌదరి ఈ పాట చిత్రీకరణ ఏప్రిల్ 15 తో పూర్తి చేద్దాం అనుకున్నారు. కాని ఇప్పుడు ఇంకో వారం పొడిగించారు. ఈ చిత్రం మొత్తం చిత్రీకరణ ఈ నెల చివరకల్లా పూర్తి కావాల్సివుంది. ఈ చిత్రం ద్వారా సాయిధరం తేజ్ పరిచయం కాబోతున్నాడు. సయామీ ఖేర్ మరియు శ్రద్దా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీ,దీనిలో అన్నిటిని ఎదోర్కొని ఒక పెద్ద పోటిలో విజేతగా నిలిచిన ఒక డాన్సు గ్రూప్ కి లీడర్ గా సాయి ధరం తేజ్ కనపడనున్నాడు . చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు . ఈ చిత్రాన్ని వై.వి.ఎస్ చౌదరి నిర్మిస్తుస్తున్నారు. ‘రేయ్ ‘ వేసవి లో విడుదల కానుంది .

Exit mobile version