పంచ్ గనిలో వెంకీ, రామ్

First Posted at 00.10 on Apr 17th

venky-ram
విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ పూణే సమీపంలో పంచ్ గని ప్రదేశానికి మారింది. మార్చ్ లో మొదలైన ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్, బంగళూరు ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్ గా మన ముందుకు వస్తున్న ఈ సినిమాకి ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు- స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అంజలి బెంగుళూర్ షూటింగ్ కు హాజరుకాలేదు . కాకపోతే పంచ్ గని షూటింగ్లో పాల్గుంటానని ఆమె తెలిపింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరువాత ఆమె వెంకీకి మరోసారి జంటగా కనిపించనుంది. ఈ సినిమాలో రామ్ సరసన ‘ఆరెంజ్’ లో నటించిన షాజన్ పదామ్సి కనిపించనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version