శ్రీ రాం కొడాలి, అమితారావ్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘కెమిస్ట్రీ – మనసుకీ మనసుకీ మధ్య’ ఈ సినిమాకి వాచెస్పతి దర్సకత్వం వహిస్తున్నాడు. వివిడ్ జర్నీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19 న అమెరికాలోని అన్ని ప్రధాన ప్రాంతాలలో విడుదలవుతుంది. ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ ‘నన్ను అందరు అడుగుతున్నారు ఈ ‘కెమిస్ట్రీ’ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుందని. రెండు హృదయాల మధ్యన ఉండే ప్రేమే కెమిస్ట్రీ.ప్రేమ కి వయసుతో సంభందం లేదు. అందుకే ఈ ‘కెమిస్ట్రీ’ సినిమా అన్ని వయసుల వారికి సంబందించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా’ అని అన్నాడు.
ఈ సినిమా నిర్మాత జి .శ్రీనివాస్ మాట్లాడుతూ ‘మా సినిమా క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్ . ఊహ తెలిసిన పిల్లాడు దగ్గిర నుంచి పండు ముసలి వారివరకు అందరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ అందుబాటు లో లేనందున ఇక్కడ సినిమాని వచ్చే వారం రిలీజ్ చేస్తాము . ఈ నెల 19 న అమెరికాలోని అన్ని ప్రధాన ప్రాంతాలలో రిలీజ్ అవుతుంది . అలాగే ఏప్రిల్ 18న అమెరికాలో ప్రీమియర్ షో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని’ అన్నారు. ఈ సినిమాకి విశ్వనాధ్ ఘంటసాల సంగీతాన్ని అందిస్తున్నాడు.