బాక్స్ ఆఫీసు వద్ద పోటిపడనున్నా నితిన్, శిరీష్, సిద్దార్థ్

First Posted at 12:53 on Apr 16th

Nithin-Siddharth-and-Shiris
అవును! మీరు వింటున్నది నిజమే ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద ముగ్గురు ప్రముఖ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ శుక్రవారం టాలీవుడ్లో ఒకేరోజు ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఆరు సినిమాలలో మూడు భారీ సినిమాలు వున్నాయి. నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ హీరోగా కొత్త పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్.హెచ్ 4, అలాగే అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తెలుగులో మొదటిసారిగా నటిస్తున్న ప్రకాష్ రాజ్ సినిమా ‘గౌరవం’ విడుదలకానున్నాయి. ఇవి కాకుండా మరో మూడు సినిమాలు ‘ఎన్.ఆర్.ఐ’, ‘చిన్నసినిమా’, ‘ఆగంతకుల అంతం’ అనే సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదిస్తుందో, ఏ సినిమా నిరుత్సాహపరుస్తుందో వేచిచూడాలి.

Exit mobile version