ఐ.పి.ఎల్ ద్వారా మన తెలుగు సినిమాలకు చుక్కెదురు

First Posted at 01.59 on Apr 16th

IPL-LOgo

ఊహించని విధంగా ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐ.పి.ఎల్) తెలుగు సినిమాలకు పెద్ద సమస్యగా నిలిచింది. మితిమీరిన క్రికెట్ వళ్ళ అలిసిపోయిన ప్రేక్షకులు మన ఐ.పి.ఎల్ ని అంతగా పట్టించుకోరని అనుకున్నాం. దీని ద్వారా సినిమాలకు జరిగే నష్టం ఉండకపోవచ్చని అనుకున్నారు. కానీ మన అంచనాలన్నీ తారుమారు అయ్యాయి.

ఈ ఏడాది సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు అద్బుతంగా ఆడుతుండడంతో నగర వాసులు ఐ.పి.ఎల్ వైపు మగ్గుచూపుతున్నారు. అంతే కాక ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా ముగుస్తుండడం దీనికి అదనపు బలాన్ని చేకూర్చింది. ప్రతిఫలంగా ప్రతీ యువ ప్రేక్షకులు వారాంతరాలలో సినిమా హాళ్ళకు రాకుండా టి.వి ల ముందు అత్తుకుపోతున్నారు. దీని మూలంగా 50శాతం ఆదాయం తగ్గిపోయిందని ఈ పరిస్థితి మే26వరకూ కొనసాగుతుందని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.

ఈ వారం ఆరు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ‘గౌరవం’, ‘గుండె జారి గల్లంతయ్యిందే ‘, ‘ఎన్.హెచ్4’ సినిమాలు ముఖ్యమైనవి. ఈ సినిమాల ప్రచార కార్యక్రమాలు బానే జరుగుతున్నా ఐ.పి.ఎల్ కారణంగా యువకులని వారాంతరాలలో సినిమాలకు రప్పించడం కష్టమైన పనే. రానున్న రెండు వారాలలో ఈ ఐ.పి.ఎల్ మన తెలుగు చిత్ర సీమను ఎంతలా భాదించనుందో త్వరలోనే పూర్తిగా తెలుస్తుంది

Exit mobile version