తాప్సీ కి బాలీవుడ్ లో భారీగా ఆఫర్స్

Tapsee

ప్రీతి జింట టాలీవుడ్ లోకి, తాప్సీ బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. తాప్సీ నటించిన ‘చష్మే బద్దూర్’ సినిమా ఈ మద్య విడుదలై మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమా విజయాన్ని సాదించడంతో తాప్సీ కి ఉత్తరానా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు తాప్సీ తో సినిమాలు తీయాలని ఆమె డేట్స్ కోసం లైన్ కడుతున్నారని సమాచారం. తాప్సీ కి ఒక పెద్ద స్టార్ తో కలిసి నటించడానికి అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి సంబందంచిన సమాచారం తొందరలోనే తెలిసే అవకాశం వుంది. తాప్సీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, తాప్సీ జంటగా నటంచిన ‘షాడో’ ఈ నెల 26న విడుదలకానుంది

Exit mobile version