‘పవిత్ర’ నా కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందన్న శ్రీయ

pavitra2

టాలెంటెడ్ బ్యూటీ శ్రీయ శరన్ గత పది సంవత్సరాలుగా సినిమాలలో నటిస్తోంది. ఏ హీరోయిన్ కూడా తనతో సమానంగా నిలవలేకపోయింది. ప్రస్తుతం శ్రీయ నటిస్తున్న ఫిమేల్ ఒరియేంటెడ్ సినిమా ‘పవిత్ర’. ఈ మద్య విడుదలై ఈ సినిమా ట్రైలర్ లో తను పెద్ద పెద్ద కళ్ళతో, చాలా కొత్తగా కనిపిస్తోంది. పవిత్ర సినిమాలో తను చేసిన పాత్ర గురించి శ్రీయ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను పవిత్ర గా చక్కని పాత్రలో నటించాను. ఈ సినిమా నా కెరీర్ లో ఒక గొప్ప సినిమా అవుతుందని నాకు నమ్మకం వుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది’ అని అంది. ఈ సినిమాని జనార్దన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈ మధ్యే విడుదలైంది. ఈ సినిమాని సమ్మర్లో విడుదలచేయనున్నారు

Exit mobile version