రాణి రానమ్మను రామకృష్ణ చుపిస్తాదట

kodiramakrshna

దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కోడి రామకృష్ణ మరో సినిమా తీయడానికి సిద్దపడ్డాడు. ఈ సినిమా తన గత గ్రాఫిక్స్ సినిమాలకంటే భిన్నంగా ఉండనుంది. ఈ ద్విబాషా సినిమాలో లక్ష్మీ రాయ్, అర్జున్ ప్రధాన పాత్రధారులు. తెలుగు వెర్షన్ పేరు ‘రాణి రానమ్మ’. ఈ సినిమా హైదరాబాద్లో ఏప్రిల్ 15న లాంచనంగా ప్రారంభమయ్యింది. ఆర్. రామచంద్ర రాజు ఈ సినిమాని శైలజ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా ఒక జంట మరియు వాళ్ళ బిడ్డ మధ్య నడిచే ఫమిల్య్ డ్రామా అంట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు.

ఈ సినిమా గత ఏడాదే మొదలు కావాల్సివుంది. కోడి రామకృష్ణ కన్నడ వెర్షన్ షూటింగ్ కుడా మొదలుపెట్టారు. కాకపోతే ఆయన బై-పాస్ సర్జరీ చేయించుకుని నాలుగు నెలల విశ్రాంతి తరువాత ఈమధ్యే కోలుకున్నారు. ‘అమ్మోరు’, ‘అరుంధతి’ వంటి అద్బుత సినిమాలే కాక 80వ దశకంలో ఎన్నో మంచి సినిమాలు ఈయన మనకు అందించారు. లక్ష్మీ రాయ్ కి మాత్రం ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఎందుకంటే ఈ సినిమా సౌత్ ఇండియాలో అన్ని బాషల్లోనూ తెరకెక్కుతుంది. ముందుగా సోనూ సూద్ ని ఒక ముఖ్యమైన పాత్రకుగానూ ఎంచుకున్నారు, కానీ దుబాయ్ లో జరిగిన సి.సి.ఎల్ మ్యాచ్ లో గాయంతో సర్జరీ చేయించుకున్నాడు. ఈ పాత్రలో మార్పులు జరగచ్చేమో చూడాలి.

Exit mobile version