మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాతో ఈ సంవత్సరం సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హిందీలో చేస్తున్న ‘జంజీర్’, అలాగే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తున్న ‘ఎవడు’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో ఉన్నా ఆయన ప్రస్తుతం జరుగుతున్న సి.సి.ఎల్ 3 మ్యాచ్ లలో పాల్గొంటున్నారు. అలాంటి చరణ్ ని ‘జంజీర్’ సినిమాతో ఎలాగూ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు.
మీరు తెలుగులో చేసి హిట్ అయిన ‘నాయక్’ సినిమా హిందీ రీమేక్‌లో మీరు నటించబోతున్నారని వార్తలోస్తున్నాయని అడిగితే రామ్ చరణ్ సమాధానమిస్తూ ‘ నేను చేసిన సినిమాలను నేను ఎప్పటికీ రీమేక్ చెయ్యను. నేను ముందుకెళ్ళాలనుకుంటాను అంతే కానీ మళ్ళీ గతంలోకి వెళ్ళి చేసినదాన్నే చెయ్యాలనుకోనని’ అన్నాడు.