మూడు .. మూడు .. మూడు ..

Sidharth

మూడు నెలల వ్యవధిలో సిద్ధార్థ్ నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. అది కూడా మూడు సినిమాలు మూడు విభిన్నమైన భాషల్లో తెరకెక్కాయి. ఇందులో మొదటగా నందిని రెడ్డి డైరెక్షన్లో సిద్ధార్థ్, సమంత కలిసి నటించిన జబర్దస్త్ మొదటగా విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటుగా తమిళ్లో ‘డుండుం పీపీ’ పేరుతో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ వెర్షన్ విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ చష్మే బద్దూర్ రీమేక్ చేస్తూ డేవిడ్ ధావన్ రూపొందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. తాప్సీ ఈ సినిమాలో కథానాయిక. ఇవి కాకుండా తమిళ్లో ‘ఉదయం ఎన్ హెచ్ 4 పేరుతో మరో సినిమా రూపొందుతుంది. మనిమరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల కానుంది.

Exit mobile version