యంగ్ టైగర్ ఎన్.టి.అర్, అందాల భామ సమంత కలిసి నటించబోతున్న కొత్త సినిమా ముహూర్తం ఈ రోజు ఉదయం జరిగింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే 15 నుండి మొదలవుతుందని, 2014 సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. దీనికి వర్కింగ్ టైటిల్ గా ‘రభస’ పేరును నిర్ణయించారు. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే దీనిని మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్.టి.అర్ – సమంత కలిసి హరీష్ శంకర్ సినిమాలో నటిస్తున్నారు.