మర్యాద రామన్న మలయాళంలో రీమేక్ కానుందా?

Maryada-Ramanna
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘మర్యాద రామన్న’ సినిమా ఇప్పటికే కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రీమేక్ కాగా ఇప్పుడు మలయాళంలో రీమేక్ కావడానికి సిద్దమవుతోంది. తాజా సమాచారం ప్రకారం సునీల్ పాత్రలో దిలీప్ కనిపించనున్నాడు. జి.ఎన్ కృష్ణ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి సిబి కె థామస్ – ఉదయక్రిష్ణ మళయాళ వెర్షన్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా 2013 సెకండాఫ్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

‘మర్యాద రామన్న’ సినిమా అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్స్ గా హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’ గా హిందీలో రీమేక్ అయ్యి 2012లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి తను తీయనున్న ‘బాహుబలి’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. గత మూడు రోజులుగా లోకేషన్స్ కోసం కర్ణాటక, కేరళను చుట్టేస్తున్నారు. అనుష్క, రానా కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమాని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మించనున్నారు.

Exit mobile version