హన్సిక, సిద్దార్థ్ లకి షాకిచ్చిన సుందర్. సి

Siddharth-and-hansika
సిద్దార్థ్ – హన్సిక జంటగా ‘తీయ వేల సేయ్యనం కుమరు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కుష్బూ నిర్మాత. జనవరి మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సుందర్ సి ఈ సినిమా తీసున్న వేగాన్ని చూసి సిద్దార్థ్ – హన్సిక షాక్ అయ్యారు. ‘ ‘తీయ వేల సేయ్యనం కుమరు’ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఇప్పటివరకూ ఇంత ఫాస్ట్ వర్క్ నేనెప్పుడూ చూడలేదు. సుందర్ సి చాలా స్పెషల్. ఇది ఫన్నీ స్క్రిప్ట్, సెట్స్ లో కూడా సూపర్బ్ ఫన్’ అని సిద్దార్థ్ ట్వీట్ చేసాడు.

‘నేను పని చేసిన అతికొద్దిమంది ఫాస్టెస్ట్ దర్శకుల్లో సుందర్ సి ఒకరు. ఈ వారాని అదిరిపోయే ప్రారంభం ఇదని’ హన్సిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలో గణేష్ వెంకట్రామన్, సంతానం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version