యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘డీకె బోస్’ సినిమాతో సన్నీ రాజు అనే కొత్త నిర్మాత టాలీవుడ్ ప్రొడ్యూసర్ క్లబ్ లో చేరుతున్నాడు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ తన మొదటి సినిమా విషయంలో ఎంతో ఉద్వేగంగా ఉన్నాడు, ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అంటున్నాడు. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
డీకె బోస్ గా సందీప్ కిషన్ నటించిన ఈ సినిమాలో నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సన్నీ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై సన్నీ నిర్మించిన ఈ సినిమాకి ఆనంద్ రంగా – శేషు రెడ్డి కో ప్రొడ్యూసర్స్. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు.