క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్?

Pawan-Krish

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కలిసి సినిమా చేయనున్నారా? అవుననే అంటున్నారు. ప్రముఖ దిన పత్రికలో పవన్ క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు అనే వార్తను ప్రచురించింది. ఈ కాంబినేషన్లో సినిమా చేయనున్నారు అనే వార్త కొద్ది రోజుల క్రితం నుండి వినపడుతున్నప్పటికీ ఎవరూ ధ్రువీకరించలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్న పవన్ ఈ సినిమా తరువాత ఏ సినిమాలో నటిస్తాడు అనేది ఇంకా ఖరారు కాలేదు. సంపత్ నందితో ఒక సినిమా చేస్తాడు అనే వార్తలు వచ్చినప్పటికీ స్టొరీ డిస్కషన్లో ఇంకా ఫైనల్ కాలేదన్నది సమాచారం. మరి పవన్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడన్నది కొంత కాలం వేచి చూడాలి. త్రివిక్రమ్ చేస్తున్న సినిమా వేసవి వరకు విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు.

Exit mobile version