సిద్ధార్థ్, సమాంత కలసి నటిస్తున్న చిత్రం “జబర్దస్త్” ఫిబ్రవరి 22 న విడుదల కాబోతుంది.ఈ సినిమా ను బెల్లం కొండ సురేష్ నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ఈ సినిమా రి-రికార్డింగ్ ముగిసింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశ లో జరుగుతుంది. త్వరలో సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్ళబోతుంది.ఈ సినిమాకు తమన్ చక్కని సంగీతాన్ని అందించారు. జబర్దస్త్ కోసం నందిని రెడ్డి చాలా హార్డ్ వర్క్ చేశారని దీనిని గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని ట్విట్టర్లో తమన్ అన్నారు. ఇందులో సిద్దార్థ హైదరాబాద్ నివాసిగా ఉంటారని ,నిత్య మీనన్ మరియు శ్రీ హరిలు ముఖ్య పాత్ర పోషించనున్నారు.