గుర్తింపు కోసం యంగ్ హీరో కష్టాలు !

Sidhu Jonnalagadda

యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’ ప్రస్తుతం ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందట. అందుకే సినిమాలో కొత్త రకంగా కనిపించడానికి తన లుక్ ను పూర్తిగా ఛేంజ్ చేస్తున్నాడట ఈ యంగ్ హీరో. లుక్ కోసం దాదాపు ఐదు నెలలు పాటు కఠినమైన కసరత్తులు కూడా చేసాడట. ఎన్ని చేసినా ‘సిద్ధు జొన్నలగడ్డ’ మాత్రం ఇంకా హీరో అనిపించుకోవడానికే కష్టపడుతున్నాడు.

ఎప్పుడో పదేళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఇంతవరకూ సరైన గుర్తింపు కూడా రాలేదు సిద్ధుకి. మరి ఇప్పుడు చేయబోయే సినిమాతోనన్నా హీరోగా నిలబడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో సిద్ధూ నేహాశెట్టితో కలిసి రొమాన్స్ చేయనున్నాడు. విమల్‌ కృష్ణ దర్శకత్వం ఈ సినిమాకి వహిస్తున్నాడు.

Exit mobile version