భర్త టీంకి భార్య బ్రాండ్ అంబాసిడర్.!

Genelia-and-Riteish
జెనిలియా త్వరలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తన భర్త రితేష్ దేశ్ముఖ్ క్రికెట్ టీంకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్ టీంలో రితేష్ కీలక ఆటగాడు. ఈ ఏడాది తనే ఒక స్వంత టీంని కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం రితేష్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ వార్తను దృవీకరిస్తూ “అవును నేను బ్రాండ్ అంబాసడర్ గా ఉండబోతున్నాను టీం లుక్ ని కూడా నేనే డిజైన్ చేసాను, రితేష్ నాకు జీవిత భాగస్వామే కాదు, ఇప్పుడు పనిలో కూడా నాకు పార్టనర్” అని అన్నారు.

Exit mobile version