మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన అల్లుడి చిత్రం గురించి చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. అదేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం “నాయక్” గురించి మాట్లాడుతున్నాం. ఈ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్ విడుదల చెయ్యవలసి ఉండగా ప్రస్తుతం అల్లు అరవింద్ మాత్రమే ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నారు. ఫిలిం నగర్లో సమాచారం ప్రకారం అరవింద్ ఈ చిత్రాన్ని రికార్డ్ స్థాయిలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సంక్రాతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ ఉండటంతో ఈ చిత్రం ప్రమోషన్ మరియు విడుదల గురించి అల్లు అరవింద్ స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మించారు. రామ్ చరణ్ సరసన కాజల్ మరియు అమలా పాల్ కథానాయికలుగా నటించారు.