‘సూపర్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కన్నడ యోగా బ్యూటీ అనుష్క. టాలీవుడ్లో క్రేజ్ ఉన్న ఈ భామ గత సంవత్సరం తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇప్పుడున్న హీరోయిన్లు చాలా వరకు కథ నచ్చాలి, కథ నచ్చితేనే సినిమా అని చెబుతున్న తరుణంలో అనుష్క మాత్రం ‘ ఎప్పటికప్పుడు సరికొత్త కథ, కొత్త పాత్ర చేయాలని ఎదుచూస్తూ కూర్చొను. ప్రతిసారీ కొత్త కథలే రావాలంటే కష్టం. పాత కథనే ఆడియన్స్ కి నచ్చేలా కొత్తగా చెప్పాలి, అలా చెబితే చాలు విజయాల్ని అందుకుంటాము. ఇప్పుడు దర్శకులు కూడా కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాఋ. నాకు కూడా సినిమా కథలో ఏదైనా ఒక్క పాయింట్ నచ్చితే చాలు సినిమా ఓకే చేస్తానని’ ఆమె అంది.
ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆడియో వేడుక ఈ రోజు హైదరాబాద్లో జరగనుంది. ఇదికాకుండా త్వరలోనే ప్రారంభం కాబోయే రాణి రుద్రమదేవి సినిమాలో నటించనుంది.