సరి లేరు నీకెవ్వరు అంటున్న నాగార్జున

Nagarjuna_Dasarath

దశరధ్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ మధ్యనే బ్యాంకాక్ లో చిత్రీకరణ పూర్తి చేసుకు వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున మొదటి సారిగా ఇండియాకి వచ్చిన ఎన్.ఆర్.ఐ పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఈ చిత్ర పేరుని “లవ్ స్టొరీ” అని పెడుతున్నారు అని పలు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఈ చిత్రం కోసం “సరి లేరు నీకెవ్వరు” అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర టైటిల్ గురించి అధికారిక ప్రకటన చెయ్యవలసి ఉంది. నయనతార ఈ చిత్రంలో నాగార్జున సరసన నటిస్తుండగా మీరా చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కామాక్షి మూవీ బ్యానర్ మీద శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

Exit mobile version