తెర మీద కనిపించడానికి ఏ నటికీ అయిన ప్రధాన ఆభరణం అందం. అందం మరియు అభినయం ఆభరణాలుగా ఉన్న నటీమణులే తెర మీద విజయం సాదిస్తారని అనుకుంటారు కాని ఇవి రెండు మాత్రమే నటికీ ఆభరణాలు కావని హన్సిక అంటుంది. అణకువ మరియు క్రమశిక్షణ నటికి నిజమయిన ఆభరణాలు అని హన్సిక చెప్తుంది. ఒక ప్రముఖ పత్రికతో హన్సిక మాట్లాడుతూ “ఏ నటికి అయినా అణకువ క్రమశిక్షణ ప్రధాన ఆభరణాలు. నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి అంటే కారణం నేను పని పై చూపించే శ్రద్ద. మన అలవాట్లే మన అందాన్ని కాపాడుతుంది అర్ధ రాత్రి వరకు టివి చూసే అలవాటు నాకు లేదు షూటింగ్ లేని సమయంలో పగలు కూడా కాస్త నిద్రపోతాను. పరిశ్రమలో పేరొందిన నటీమణులు అందం ఒక్కదానితోనే ఆ స్థాయికి ఎదగలేదు కదా” అని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం “నాటిబాయ్స్” మరియు “యముడు 2” చిత్రాలలో నటిస్తున్నారు.