మార్చ్ లో రానున్న శ్రియ పవిత్ర

pavitra2
శ్రియ శరన్ త్వరలో “పవిత్ర” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో ఆమె వేశ్యగా నటిస్తున్నారు. గతంలో “దేవస్థానం” చిత్రానికి దర్శకత్వం వహించిన జనార్ధన్ మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కే సాధక్ కుమార్ మరియు జి మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మొదటి లుక్ విడుదల చేసిన ఒక రోజు తరువాత ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ” ఈ చిత్రం నిజ జీవితంలో ఎటువంటి పొందింది కాదు ఈ చిత్రంలో చెయ్యడానికి ఒప్పుకున్న ప్రతి నటుడికి/నటికీ నా కృతజ్ఞతలు” అని దర్శకుడు జనార్ధన్ మహర్షి తెలిపారు. ఇంత మంచి పాత్ర తనకి ఇచ్చినందుకు శ్రియ దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఈ చిత్రం ఒక వేశ్య చుట్టూ తిరుగుతుంది, ఈ చిత్రంలో చివరగా ఆమె రాజకీయ నాయకురాలు అవుతుందని సమాచారం. సాయి కుమార్, రోజా మరియు ఏ వి ఎస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వి ఎన్ సురేష్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం ఈ నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకొని మార్చ్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Exit mobile version