10న సీతమ్మ వాకిట్లో.. ప్రీమియర్ షో – దిల్ రాజు

Dil-Raju-svsc
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సంక్రాంతికి ఇంటిల్లిపాదిని అలరించడానికి జనవరి 11న వచ్చేస్తోందని నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేసారు. ‘ జనవరి 11 అమావాస్య కావడం వల్ల జనవరి 10 రోజు సాయంత్రమే ప్రీమియర్ షో వేస్తున్నాం. అది ఒక్క షోనా లేక ఎక్కువ షోలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆ విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని’ దిల్ రాజు అన్నారు.

అలాగే మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాని సెన్సార్ కి పంపించనున్నాము. మణిశర్మ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. సమంత – అనజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version