యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ముహూర్తం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. బృందావనం కాంబినేషన్ రిపీట్ అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా సమంత నటించబోతుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ బృందావనం సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. జూలైలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు.