యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగానే కాకుండా మంచి మనిషి కూడా, లేడీస్ విషయంలో ప్రభాస్ తన మంచితనాన్నిమరోసారి నిరూపించుకున్నాడు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా ఆడియో జనవరి 5న జరగనుంది, ఈ ఫంక్షన్ కి భారీ ఎత్తున అభిమానులు వస్త్రారని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ వేడుకలో లేడీస్ కి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని వారికోసం స్పెషల్ పాస్ లు తయారు చేసారు. ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది, అలాగే వారందరూ మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘మిర్చి’ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని ప్రమోద్ ఉప్పలపాటి – వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.