2012 సంవత్సరం పూర్తి చేసుకుని 2013లో అడుగు పెట్టాము. మరి ఈ సంవత్సరం రాబోయే మొదటి తెలుగు సినిమాలు ఏంటి? 2013లో రాబోతున్న మొదటి తెలుగు సినిమా ‘సేవకుడు’. శ్రీకాంత్, చార్మి జంటగా నటించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కాబోతుంది. వి. సముద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ముత్తినేని సత్యనారాయణ నిర్మించాడు. శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా సూపర్ స్టార్ కృష్ణ, మంజుల ఒక ప్రత్యేక పాత్రల్లో నటించారు. దీనితో పాటుగా 916 కేడీఎమ్ ప్రేమ, ఆపరేషన్ ఐపీఎస్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.