విశ్వరూపం సంక్రాంతికి వస్తుందా?

Vishwaroopam

కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా సంక్రాంతి రేసులో నిలవడానికి సిద్ధమవుతుంది. తమిళ్లో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో డబ్ కాగా తెలుగు వెర్షన్ జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకరోజు ముందుగానే జనవరి 10న డీటీహెచ్ చానల్స్ లో ప్రీమియర్ గా రాబోతున్న ఈ సినిమాని తెలుగులో దాసరి నారాయణ రావు సిరి మీడియా ద్వారా విడుదలకి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ లాంటి రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుండగా ఈ సినిమాకి ధియేటర్లు రల దొరుకుతాయి అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అయితే సిరి మీడియా ద్వారా దాసరి నారాయణ రావు లాంటి వ్యక్తి విడుదలకు పట్టుబట్టడంతో ఆయన కింద లీజుకి ధియేటర్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని, మిగతా ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. సెన్సార్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది.

Exit mobile version