కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నామని.. డెడ్లీ ఫైట్ మాస్టర్స్ తో అధిరా మీద ఫైట్ అద్భుతంగా వస్తోంది అన్నట్లు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఇప్పటికే చాలా భాగం షూట్ చేశారు.
కాగా సినిమా మొత్తంలోనే అధీరా డైలాగ్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. కాగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గనులు. దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనుల పై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్న దానిని తొలి భాగంలోనే ప్రశాంత్ అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2ల ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించనున్నారు.