నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని తన దర్శకత్వంలో పరిచయం చెయ్యడానికి దర్శకుడు వి వి వినాయక్ సకలం సిద్దం చేసుకున్నారు. పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం బెల్లం కొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ను తెరకు పరిచయం బెల్లంకొండ సురేష్ చాలా రోజుల నుండి వేచి చూస్తున్నారు చివరకి వి వి వినాయక్ దర్శకత్వంలో పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వి వి వినాయక్ కన్నా ముందు పలువురు దర్శకులను పరిశీలించారు. ఇదిలా ఉండగా వి వి వినాయక్ నూతన నటుడితో చెయ్యడం దాదాపుగా పదేళ్ళ తరువాత జరుగుతుంది. ఈ దర్శకుడు పరిశ్రమలో టాప్ హీరోలతోనే ఎక్కువగా చిత్రాలు చేశారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం వి వి వినాయక్ “నాయక్” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న “నాయక్” జనవరి 9న విడుదల కానుంది.