వచ్చే నెల బ్యాంకాక్ వెళ్లనున్న పెళ్లి పుస్తకం టీం

Pelli-Pusthakam
పెళ్ళంటే రెండు జీవితాలు ఒక్కటవ్వడం, కాని పెళ్లి ఇద్దరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అన్నదే కథాంశం గా రానున్న చిత్రం “పెళ్లి పుస్తకం”. “అనుకోని పరిస్థితులో పెళ్లి చేసుకున్న ఇద్దరు మొదట్లో దూరంగా ఉన్నా చివరికి ఎలా దగ్గరయ్యారు అన్నదే ఈ చిత్రం. అన్ని ప్రేమకథలకు పెళ్లి శుభం కార్డు అయితే మా కథ పెళ్ళితోనే మొదలవుతుంది కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకేక్కించాను” అని దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి తెలిపారు. రాహుల్, నీతి టేలర్ ప్రధాన పాత్రలలో రానున్న ఈ చిత్రాన్ని పి సుమన్ నిర్మిస్తున్నారు.వచ్చే నెల 9 నుంచి బ్యాంకాక్, మలేసియాల్లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version