యువతంటే లక్ష్యానికి వేగానికి మరో పేరు అని చెప్పచ్చు అలంటి యూత్ లో వేగాన్ని కథాంశం గా తీసుకొని ఒక ప్రేమకథ చిత్రం రానుంది. అజయ్ కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం యూత్ లో వేగాన్ని ఆవిష్కరిస్తుంది అని దర్శకుడు తెలిపారు. కార్తీక్, భూషణ్, వంశీ, వరుణ్, శ్రుతి, ప్రేక్షశ్రీ, శ్రీకీర్తి ముఖ్య తారలుగా స్నేహ సంయుక్త మూవీస్ పతాకంపై కె.రాజేందర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక్క పాత మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. కోట శ్రీనివాసరావు ,సుమన్, పోసాని కృష్ణమురళి, వైజాగ్ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోద్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జశ్వాత్ సినిమాటోగ్రఫీ అందించగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చెయ్యనున్నారు.