స్టార్ హోదా అవసరం అంటున్న శర్వానంద్.!

Sharvanand
ఇమేజ్, స్టార్డంతో సంబంధం లేకుండా తననకు నచ్చిన విభిన్న పాత్రలు చేస్తూ నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్. అలాంటి శర్వానంద్ నటనతో పాటు సినిమా నిర్మాణం వైపు కూడా అడుగులేస్తూ నిర్మించిన మొదటి సినిమా ‘కో అంటే కోటి’. శర్వానంద్, ప్రియా ఆనంద్ జంటగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఒక సినిమాకి స్టార్ హోదా అనేది అవసరమా? మీరు కూడా దాన్ని నమ్ముతారా? అని అడిగితే ‘ స్టార్డంని నేను కూడా నమ్ముతాను. దానికి గల ముఖ్య కారణం ఆ స్టార్ హోదానే ప్రేక్షకున్ని థియేటర్ వరకు రప్పిస్తుంది. కథ బాగుండి, వారు తమ హీరో నుండి ఆశించే అన్ని అంశాలు ఉంటేనే సినిమా విజయం సాదిస్తుంది. అదే కథలో విషయం లేకపోతే మాత్రం సినిమా ఆడదని’ శర్వా అన్నాడు. శ్రీ హరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి అనీష్ యోహాన్ కురువిల్లా డైరెక్టర్.

Exit mobile version