ఎనర్జిటిక్ హీరో రామ్ కృతి ఖర్బంధ కలిసి జంటగా నటిస్తున్న ‘ఒంగోలు గిత్త’ విడుదల తేదీ 2013 జనవరి నెలాఖరుకి మారింది. మొదట డిసెంబర్ నెలాఖరుకి విడుదల చేయాలని అనుకున్నారు. ఇదే సమయానికి చిన్న సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతుండటం సంక్రాంతి సమయానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ సినిమాలు విడుదలవుతుండటంతో ఈ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఆరంజ్ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ భారీ గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రమిదే. ఒంగోలు గిత్త భాస్కర్ కి కీలక చిత్రం కావడంతో తన మొదటి సినిమాలు లవ్ స్టొరీ జానర్ నుండి బైటికి వచ్చి మాస్ మసాలా సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.