మరో ట్రెండ్ సృష్టించనున్న సీతమ్మ వాకిట్లో…

SVSC
“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం తెలుగు పరిశ్రమలో సృష్టిస్తున్న ట్రెండ్ ల సంగతి అందరికి తెలిసిందీ ఈ చిత్ర నటీనటులు, ఆడియో విడుదల అన్నింట్లోను ఇది తనదయిన శైలిని చూపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మరో ట్రెండ్ ని సృష్టించనుంది. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మొత్తం జనవరి 10న ప్రీమియర్ ప్రదర్శన జరుపుకోనుంది. ఇది కనుక విజయవంతమయితే ఇలాంటివి భవిష్యత్తులో అన్ని చిత్రాలకు చూడవచ్చు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్,మహేష్ బాబు, సమంత మరియు అంజలి లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version