సుదీప్ తో చిత్రాన్ని చెయ్యనున్న రామ్ గోపాల్ వర్మ

rgv-and-suddep
తాజా సమాచారం ప్రకారం రామ్ గోపాల్ వర్మ, సుదీప్ ప్రధాన పాత్రలో విభిన్న బాషలలో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గతంలో వీరిరువురు కలిసి “ఫూంక్” , “రక్త చరిత్ర” మరియు “రన్” వంటి చిత్రాల కోసం పని చేశారు. “రన్” చిత్రంలో సుదీప్ ని చూసిన రాజమౌళి “ఈగ” చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటింపచేసాడు దీంతో ఇక్కడ కూడా సుదీప్ మంచి పేరు సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తెలుగు, కన్నడలో చిత్రాన్ని తెరకెక్కించి తరువాత హిందీ మరియు తమిళంలో కి అనువదిస్తారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం తన రాబోతున్న చిత్రం “26/11 దాడులు” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. త్వరలో అనిల్ సుంకర “యాక్షన్” చిత్రంలో సుదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version