శృతి హసన్ తో చిత్రం చెయ్యాలని నాకు ఉంది – కమల్ హాసన్

kamal_Guess
“లక్” చిత్రంతో తెరకు పరిచయం అయిన శృతి హాసన్ ఆరోజు నుండి ఎదుర్కొంటున్న ప్రశ్న ఒకటే “కమల్ హసన్ గారితో ఎప్పుడు నటిస్తారు?” అని ఈ ప్రశ్నకు సమాధానం ఆమె తన తండ్రి అభిప్రాయానికే వదిలేసినట్టు చెప్పారు. ఈరోజు కమల్ హాసన్ ని ఇదే ప్రశ్న అడుగగా అయన ఇలా సమాధానం ఇచ్చారు “తను ఇప్పటికే ఒక విజయం దక్కించుకుంది హిందీలో మరో విజయం సాదిస్తే నేను తనతో చిత్రం చెయ్యడానికి సిద్దం, నటుడిగా కన్నా నిర్మాతగా ఇద్దరు స్టార్స్ ఒకే చిత్రంలో ఉండటం నాకు చాలా ఇష్టం” అని అన్నారు. శృతి హాసన్ చిన్నతనంలో “హే రామ్” అనే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. తరువాత “ఈనాడు” చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా కమల్ హాసన్ ప్రస్తుతం “విశ్వరూపం” చిత్రం ప్రమోషన్ లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ జనవరి 11న విడుదల అవుతుండగా తెలుగు వెర్షన్ జనవరి ద్వితీయార్ధంలో రానుంది.

Exit mobile version