మళ్ళీ కాలేజ్ కి వెళ్లనున్న ఎన్.టి.ఆర్

jr.ntr-latest
హరీష్ శకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాలో ఎన్.టి.ఆర్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పాడు. అలాగే ఇప్పటివరకూ ఎన్.టి.ఆర్ చేసిన పాత్రలకు భిన్నంగా, ఎంతో ఎంటర్టైనింగ్ గా ఎన్.టి.ఆర్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జనవరి 3 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు అనగానే అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.ఈ సినిమాని గతంలో ‘సింహాద్రి’ సినిమా రిలీజ్ అయిన జూలై 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.

Exit mobile version