సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’లో మహేష్ డబుల్ రోల్ చేయబోతున్నాడని.. అందులో ఒక క్యారెక్టర్ లుక్.. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ లుక్ లో ముందెప్పుడూ చూడని లుక్ లో మహేష్ కనిపిస్తాడట. అలాగే మరో లుక్ లో లవర్ బాయ్ గా మహేష్ నటించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఇంతకీ ఏ అంశం పై ఉండనుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రాశారట. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.