ఫుల్ ప్రమోషన్స్ లో ‘లక్ష్మీ’ ?

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా వస్తోన్న ‘లక్ష్మీ’ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రమోషన్లలో అక్షయ్ కుమార్ మరియు కియారా అద్వానీతో పాటు దర్శకనిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఇక విడుదలైన ట్రైలర్ కూడ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈలోపు సినిమాకు పెట్టిన ‘లక్ష్మీ బాంబ్’ పేరు మీద అభ్యంతరాలు మొదలయ్యాయి.

భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ పేరును తొలగించాలని కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో ఆలోచనలోపడిన టీమ్ విడుదల సమయంలో అనవసర వివాదాలను పెంచుకోవడం ఇష్టంలేక సినిమా పేరును ‘లక్ష్మీ’ గా మార్చారు. నవంబర్ 9 ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదలకానుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయకిగా నటించడం జరిగింది.

Exit mobile version