నిర్మాత పిడివి ప్రసాద్ ఇంట విషాదం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పిడివి ప్రసాద్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి అంజు ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్‌ లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంజు ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 53 ఏళ్లు. పిడివి ప్రసాద్ దంపతులకు ఒక కుమారుడు, ఒక్క కుమార్తె ఉన్నారు. అంజు ప్రసాద్ మరణించిన సంగతి తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంజు ప్రసాద్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు.

పిడివి ప్రసాద్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో రూపొందే చిత్రాలకు సమర్పకుడిగా ఉంటూ వస్తున్నారు. ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో, అ..ఆ, జెర్సీ, భీష్మ’ సినిమాలకు ఆయన సమర్పకుడిగా ఉన్నారు. మంచి చిత్రాలను అందిస్తారనే పేరుంది ఆయనకు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, దర్శకులకు ఆయన సుపరిచితులు.

Exit mobile version