టాలివుడ్లో విలక్షణ నటులలో ఒకరయిన తనికెళ్ళ భరణి ఈ మధ్యనే “మిధునం” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి అద్భుతమయిన స్పందన అందుకుంటుంది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసిన తనికెళ్ళ భరణి ఇలా స్పందించారు “యువత నుండి పెద్ద వాళ్ళ వరకు అందరు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. నా ప్రయత్నాన్ని జనం ఆదరించారు. ఇంతకన్నా నాకు ఏం కావాలి?” అని ఒక ప్రముఖ పత్రికతో చెప్పారు. “మిథునం” వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపని ఇటువంటి చిత్రాలు జీవితం గురించి నేర్పుతాయి ఇలాంటి మరిన్ని చిత్రాలతో తనికెళ్ళ భరణి మన ముందుకి రావాలని కోరుకుందాం.