నటుడు శర్వానంద్ అందరిలా రొటీన్ సినిమాలు చేయకుండా నా రూటే సెపరేట్ అంటూ కథా బలమున్న సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాలు గమనిస్తే రెగ్యులర్ కమర్షియల్ అంశాలు పక్కన పెట్టి సామజిక దృక్పథంతో ఉన్న సినిమాలే ఎక్కువ ఉంటాయి. సినిమాలు ఎంచుకునే ముందు ఎలాంటి అంశాలు చూస్తారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘కథలో కొత్తదనం, కథా బలం, కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఆ కథలో నాకు ఇచ్చిన పాత్రకి నేను సూట్ అవుతానా లేదా అనేది చూసుకుంటాను అన్నాడు. అమ్మ చెప్పింది, గమ్యం, అందరి బంధువయ, ప్రస్థానం ఇలా కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తున్న శర్వానంద్ లేటెస్ట్ గా కో అంటే కోటి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నటించడంతో పాటు ఈ సినిమాకి నిర్మాత కూడా అతడే. మొదటి సినిమా విఫలమైనా అనీష్ యోహాన్ కురువిల్లా చెప్పిన కథని నమ్మి అతనికి ఈ అవకాశం ఇచ్చాడు.