యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రానున్న సినిమా జనవరి 3 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమంత జోడీ కట్టనుంది, అలాగే మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జనవరి 3 నుంచి జనవరి 14 వరకు హైదరాబాద్లో జరగనుంది. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను మరియు ఒక యాక్షన్ సీక్వెన్స్ ని తీయనున్నారు.
మొదటి సారి హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాద్రి’ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడంతో ఈ సినిమాని జూలై 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి చోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్.