నిఖిల్ ’18 పేజెస్’ నుండి అనుపమకు స్వాగతం !

కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్.. తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా అనుపమాకి సంబందించి చిత్రబృందం ట్వీట్ చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మీకు స్వాగతం పలకడం ద్వారా.. మా సినిమా తదుపరి అధ్యాయం యొక్క అందమైన పేజీని తిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మాతో అద్భుతమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాము’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

మరి అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు ఈ సినిమాతో బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది.

Exit mobile version