“టక్ జగదీష్” కు కరోనా సెగ.?

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “టక్ జగదీష్”. నాని అన్ని సినిమాల్లానే ఆడియన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే నాని లేటెస్ట్ గా “వి” చిత్రంతో ఆకట్టుకోడం మళ్ళీ దీనికి పూర్తి వేరియేషన్ ఉండడంతో హైప్ కూడా నెలకొంది. ఇక ఈ లాక్ డౌన్ లో అన్ని సినిమాల్లానే ఈ చిత్రం షూట్ కూడా నిలిచిపోయి మళ్ళీ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.

అయితే ఇప్పుడు షూటింగ్స్ ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయో తెలిసిందే. ఇప్పుడు అదే ప్రమాదకర పరిస్థితి టక్ జగదీష్ టీం కు ఎదురైనట్టు తెలుస్తుంది. ఇటీవలే తక్కువ మంది సిబ్బందితోనే షూట్ ను మొదలు పెట్టినప్పటికీ వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో షూట్ ను యూనిట్ ఒక రెండు వారాల పాటు నిలిపారట. ఆ తర్వాత నుంచి మళ్ళీ షూట్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version