డిసెంబర్ 26న శేఖర్ సూరి ‘అరవింద్ 2’ ఆడియో విడుదల

Aarvind2
గతంలో “ఏ ఫిలిం బై అరవింద్” చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ సూరి తాజాగా “అరవింద్ 2” అనే మరో థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. “ఈ రోజుల్లో ” ఫేం శ్రీ , అడోనికా రోడ్రిక్స్, రిషి, కమల్ కామరాజు మరియు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు ఆడియోని డిసెంబర్ 26న సినీమాక్స్ లో విడుదల చెయ్యనున్నారు. జి ఫణింద్ర ఈ చిత్రాన్ని విజభేరి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version