అప్పుడే మాస్ మహారాజ్ నుంచి ఫీస్ట్ రెడీ.!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ్ రవితేజ మంచి స్పీడ్ మీదున్నారు. తాను చేసిన లాస్ట్ చిత్రం “డిస్కో రాజా” వైఫల్యం ఎఫెక్ట్ ఏమాత్రం చూపించకుండా రవితేజ మరింత ఉత్సాహంగా మరిన్ని ప్రాజెక్ట్ లు రవితేజ లైన్ లో పెట్టేసారు. అలా తాను ఇప్పుడు చేస్తున్న పవర్ ఫుల్ పోలీస్ డ్రామా “క్రాక్” పూర్తి కావస్తున్న నేపథ్యంలో రవితేజ తన మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు.

గత కొన్నాళ్ల నుంచి దర్శకుడు రవివర్మతో మంచి యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ తో రేపే ఈ సినిమా ముహూర్తం అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చెయ్యనున్నట్టుగా ప్రకటించేసారు. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యనున్నారు. మరి ప్రాజెక్ట్ లో మహేష్ లుక్ ఎలా ఉండనుందో చూడాలి. మొత్తానికి మాత్రం రవితేజ నుంచి మరో ఫీస్ట్ రెడీగా ఉందని చెప్పాలి.

Exit mobile version