మాస్ మహారాజ రవితేజ చాలా రోజుల క్రితమే రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆయన చేస్తున్న ‘క్రాక్’ షూటింగ్ చివరి దశలో ఉండటంతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. సినిమాను లాంఛ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18 చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. ఇది కూడ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తారని టాక్. అందుకే ఆయనకు జోడీగా రాశీఖన్నా, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం. అలాగే ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన డింపుల్ హయాతీ ఇందులో కూడ ఒక స్పెషల్ సాంగ్ చేయనుందట. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ రవితేజతో గతంలో ‘వీర’ సినిమా చేయడం జరిగింది. ఇటీవలే ఆయన ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.